పెళ్లి పేరిట విదేశీ మహిళకు కుచ్చుటోపీ: ముగ్గురికి జైలు శిక్ష

- November 28, 2022 , by Maagulf
పెళ్లి పేరిట విదేశీ మహిళకు కుచ్చుటోపీ: ముగ్గురికి జైలు శిక్ష

యూఏఈ: పెళ్లి పేరిట మోసం అబుధాబికి చెందిన ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిపై ఓ విదేశీ మహిళ వేసిన సివిల్ దావాను కోర్టు సమర్థించింది. కేసును విచారించిన అబుధాబి కుటుంబ, సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ మహిళ నుండి తీసుకున్న 1.4 మిలియన్ దిర్హామ్‌లకు అదనంగా మరో 20,000 దిర్హామ్‌లను ఆమె అనుభవించిన నష్టానికి పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే మహిళ న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని నిందితులను కోర్టు ఆదేశించింది.

కోర్టు ఫైల్స్ ప్రకారం.. అబుదాబిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తరపున ఇద్దరు మహిళలు విదేశీ మహిళను వివాహ కోసం సంప్రదించారని తెలిపింది. వారు ఆమెతో కమ్యూనికేట్ కావాడానికి తప్పుడు గుర్తింపును ఉపయోగించారు. అబుధాబిలో పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు నిందితులు తన నుంచి 1.4 మిలియన్ దిర్హామ్‌లు వసూలు చేశారు. అనంతరం వారి నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అబుధాబి క్రిమినల్ కోర్టు గతంలో ముగ్గురు నిందితులకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే మొదటి ముద్దాయి అయిన వ్యక్తిని జైలు శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం బాధిత మహిళ ముగ్గురు నిందితులపై సివిల్ దావా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com