ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న చిరంజీవి

- November 28, 2022 , by Maagulf
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న చిరంజీవి

గోవా: మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2022 అవార్డు ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు . గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో చిరంజీవి ఈ అవార్డును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులమీదుగా చిరంజీవి అందుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నానని .. తాను మెగాస్టార్ స్థాయికి చేరానంటే లైట్ బాయ్ నుంచి సినీ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని అన్నారు. ఈ అవార్డుకు కారణమైన ప్రతి ఒక్కరికీ నిండు మనసుతో శిరసు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ తనను మెగాస్టార్ ను చేసిందని, ఇవాళ ఇక్కడి వరకు నడిపించిందని, వారి ప్రేమకు తాను దాసుడ్ని అని చెప్పారు. వారి పట్ల జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. రాజకీయాల నుంచి మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత తనకు సినిమా పరిశ్రమ విలువ తెలిసిందని చిరంజీవి వెల్లడించారు.

ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని తెలిపారు. అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం అని .. చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉంటేనే ఎదుగుతామని స్పష్టం చేశారు. ప్రతిభ ఉండి ఉపయోగించుకోగలిగితే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని, తాను ఆ విధంగానే ఎదిగానని వివరించారు. తనకు యువ హీరోలు పోటీ అని భావించడంలేదని, తానే వాళ్లకు పోటీ అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com