ఫిబ్రవరి 27 నుంచి ఒమన్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్
- November 29, 2022
మస్కట్: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8 వరకు జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సి) మాస్టర్స్ టోర్నమెంట్ కు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ్గజాలు క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, షేన్ వాట్సన్, యూసుఫ్ పఠాన్ తదితరులు పాల్గొనే అవకాశం ఉన్నది. అల్ అమెరత్‌లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ప్రారంభ వేడులకను నిర్వహించనున్నారు. ఒమన్ జనవరి 2022లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభ ఎడిషన్‌ను నిర్వహించింది. ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్ లీగ్ పేరును LLC మాస్టర్స్‌గా పేరు మార్చారు.
ఒమన్-ఖతార్ సంయుక్తంగా నిర్వహిస్తున్ ఈ టోర్నీలో మూడు జట్లు - ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు జట్లలో క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, యూసుఫ్ పఠాన్ సహా మొత్తం 60 మంది క్రికెట్ దిగ్గజాలు ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!