ఆకాశంలో ఒకేసారి బృహస్పతి, శని, శుక్ర, అంగారక గ్రహాలు

- November 29, 2022 , by Maagulf
ఆకాశంలో ఒకేసారి బృహస్పతి, శని, శుక్ర, అంగారక గ్రహాలు

కువైట్: ఆకాశంలో ఒకేసారి బృహస్పతి, శని, శుక్ర, అంగారక గ్రహాలను చూసే అరుదైన అవకాశం వచ్చింది. ఈ మేరకు షేక్ అబ్దుల్లా అల్-సలేం కల్చరల్ సెంటర్ వెల్లడించింది. నాలుగు ప్రకాశవంతమైన గ్రహాలు సాధారణ కంటికి కనిపిస్తాయని తెలిపింది.

సూర్యాస్తమయం అయిన వెంటనే అరగంట పాటు శుక్రుడిని కంటితో చూడవచ్చని, శని గ్రహాన్ని 10:18 గంటలకు  చూడవచ్చని కేంద్రం జనరల్ సూపర్‌వైజర్ ఖలీద్ అల్-జమాన్ తెలిపారు. సూర్యాస్తమయం నుంచి తెల్లవారుజామున 1:23 గంటల వరకు ఆకాశంలో బృహస్పతి గ్రహాన్ని, సాయంత్రం 5:35 గంటలకు మార్స్ గ్రహాన్ని చూడవచ్చని వెల్లడించారు.

సౌర వ్యవస్థలో రెండవ అతి చిన్న గ్రహమైన మార్స్.. ఆకాశంలో ప్రకాశ వంతంగా మారుతుందని, వచ్చే నెలలో గరిష్ఠ ప్రకాశవంతంగా వెలుగుతుందన్నారు. మార్స్ లో ఐరన్ ఆక్సైడ్ కారణంగా.. ప్రకాశవంతమైన ఎరుపు నక్షత్రం వలె మార్స్ కనిపిస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com