ఒమన్ మిస్సింగ్ మహిళ హమిదా మృతదేహం లభ్యం
- November 29, 2022
మస్కట్: 55 రోజుల క్రితం తప్పిపోయిన ఒమన్ పౌరురాలు హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రీ కథ విషాదాంతంగా ముగిసింది. ఆమె మృతదేహాన్ని సోమవారం కనుగొన్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ప్రక్రియ కొనసాగుతోందని ఆర్ఓపీ తెలిపింది. రాయల్ ఒమన్ పోలీస్ మరణించిన వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేసింది. ఆమె కోసం గాలింపు కార్యకలాపాలలో పాల్గొన్న స్వచ్ఛంద బృందాలు, పౌరులకు అభినంనలు తెలపింది. 57 ఏళ్ల పౌరురాలు హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రీ, అల్ దఖిలియా గవర్నరేట్‌లోని ఇజ్కిలోని తన ఇంటి నుంచి అక్టోబర్ 3( సోమవారం) తప్పిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!







