డిసెంబర్ 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్-19 విధానాలు

- November 30, 2022 , by Maagulf
డిసెంబర్ 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్-19 విధానాలు

మనామా: డిసెంబరు 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్ 19 విధానాలు అమల్లోకి రానున్నాయి. కింగ్‌డమ్, సిత్ర మాల్‌లోని కొవిడ్ సెంటర్ లను మూసివేయనున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ కరోనా వైరస్ (COVID-19) ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్-19 సంబంధిత పరీక్షలు, టీకాల డ్రైవ్ చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో కొనసాగుతుందని తెలిపింది. అన్ని కొవిడ్-19 చికిత్సలు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లోని ‘సెహతి’ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న మేక్-షిఫ్ట్ సౌకర్యం మూసివేయబడుతుందని టాస్క్‌ఫోర్స్ తెలిపింది. వీటితోపు రోజువారీ కరొనా అప్డేట్ నివేదికను వెల్లడించడాన్ని ఆపివేయనున్నట్లు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com