యూఏఈ జాతీయ దినోత్సవం: 1,040 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2022
యూఏఈ: యూఏఈ 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఎమిరేట్‌లోని 1,040 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, వారి కుటుంబాలకు సంతోషాన్ని కలిగించడానికి షేక్ మహమ్మద్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారని తెలిపారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆర్డర్‌ను అమలు చేయడానికి దుబాయ్ పోలీసులతో సమన్వయం చేయడం ప్రారంభించిందని అల్ హుమైదాన్ చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక సందర్భాలలో దేశ పాలకులు చాలా మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారని.. దాంతో వారు సత్ర్పవర్తన కలిగి సమాజంలో మెరుగైన జీవనాన్ని పొందుతారన్నారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!