ఆధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో బంద‌ర్ పోర్ట్ నిర్మాణం

- April 24, 2016 , by Maagulf

ప్ర‌పంచంలో అతిపెద్ద జెబెల్ ఆలి పోర్ట్ దుబాయ్‌లో ప‌రిశీలించిన మంత్రి కొల్లు ర‌వీంద్ర 
దుబాయ్‌లోని జెబెల్ ఆలి పోర్ట్‌ను మంత్రి కొల్లు ర‌వీంద్ర ప‌రిశీలించారు. ఆధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో బంద‌ర్ పోర్టును నిర్మించాల‌నే ధ్యేయంతో మంత్రి కొల్లు ర‌వీంద్ర ప్ర‌పంచంలో అతిపెద్ద పోర్ట్ అయిన జెబెల్ పోర్ట్‌ను దుబాయ్‌లో ఈరోజు ప‌రిశీలించ‌డం జ‌రిగింది.   త్వ‌ర‌లో బంద‌ర్‌లో నిర్మించ‌త‌ల‌పెట్టే పోర్ట్‌కు అనువైన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, అక్క‌డ పోర్ట్ నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు.  దీంతోపాటు అలీ అండ్ స‌న్స్ ఆఫ్‌సోర్ మ‌రియు మెరైన్ సాంకేతిక నిపుణుల బృందంతో భేటి అయ్యారు.  ఈసంద‌ర్భంగా పోర్ట్ నిర్మాణం, షిప్‌ల త‌యారు, రిపేరి, జెట్టి నిర్మాణం, షిప్ లిప్ట్ లు మ‌రియు షిప్ బిల్డింగ్స్ నిర్మాణం, ఎక్స్‌పోర్ట్స్‌, మెరైన్ స‌ర్వీసులు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింది.  ఈ సంద‌ర్భంగా మంత్రి కొల్లు ర‌వీంద్ర అలీ అండ్ స‌న్స్ సాంకేతిక నిపుణుల‌ను బంద‌ర్‌కు ఆహ్వానించ‌డం జ‌రిగింది.  బంద‌ర్ పోర్ట్ నిర్మాణం, అభివృద్ధిలో వారి స‌హాయ స‌హ‌కారాలు కోర‌డం జ‌రిగింది.  ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌తో పాటు కొల్లూరి శివ‌కుమార్‌, మాగల్ఫ్ శ్రీ‌కాంత్, నాగూర్ షేక్‌లు పాల్గొన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com