శ్రీలీలా.! ఇంత కక్కుర్తి నీకేలా.?
- December 03, 2022
కన్నడ బ్యూటీ శ్రీలీలా..! ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అందంగా పరిచయమైన ముద్దుగుమ్మ. తొలి సినిమా భారీ అంచనాలతో రిలీజైంది. కానీ, అస్సలు అంచనాలను అందుకోలేకపోయింది.
అయినా కానీ, హీరోయిన్గా శ్రీలీల టాలీవుడ్ జనాన్ని బాగా టెంప్ట్ చేసింది. అమ్మడి టెంప్టేషన్స్కి రెచ్చిపోయిన మేకర్లు బాగానే అవకాశాలిస్తూ వచ్చారు.
దొరికిన ప్రతీ అవకాశాన్నీ ముందూ వెనకా ఆలోచించకుండా శ్రీలీల ఒప్పేసుకుంటోంది. దాంతో, తెలివిగా కెరీర్ బిల్డప్ చేసుకోలేకపోతోందన్న ఆరోపణలున్నాయ్.
చేసిన ఒక్క సినిమా అయినా పది కాలాలు చెప్పుకునేలా వుండాలి. కానీ, వస్తున్నాయ్ కదా.. అని అన్ని సినిమాలనూ ఓకే చేసేస్తే ఎలా వుంటుంది.? శ్రీలీలలాగే వుంటుంది.
ఇప్పటికే రవితేజతో ‘ధమాకా’ సినిమాని ఒప్పుకోవడం పట్ల ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తుంటే, తాజాగా త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి మరోసారి ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరుస్తోంది శ్రీలీల.
త్రివిక్రమ్ - మహేష్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాలంటే సెకండ్ హీరోయిన్ వుండాల్సిందే. ఈ సారి ఆ ఛాన్స్ శ్రీలీల కొట్టేసిందన్న మాట. అయితే, సెకండ్ హీరోయిన్ రోల్ వల్ల శ్రీలీలకి పెద్దగా ఒరిగేదేమీ వుండదని ఫ్యాన్స్ అభిప్రాయం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్







