ధనుష్‌పై కన్నేసిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ.!
- December 03, 2022
తమిళ స్టార్ హీరో ధనుష్.. ఇప్పుడు తమిళ సినిమాలతో పాటూ, తెలుగు సినిమాలపైనా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ధనుష్.. ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ కూడా చేస్తున్నాడు.
ఆ కోవకు చెందినదే ‘సర్’. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాగా, అసలు ముచ్చట ఏంటంటే, ‘సవ్యసాచి’ బ్యూటీ నిధి అగర్వాల్‌కి హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా వున్నప్పటికీ టైమ్ కలిసి రావడం లేదు.
దాంతో, రేస్‌లో అస్సలు పోటీ పడలేకపోతోంది. తెలుగులో మొదటి రెండు సినిమాలూ తుస్ మన్నాయ్. ఎలాగోలా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ కొట్టేసిందనిపించుకున్నా, ఆ తర్వాత మళ్లీ చతికిలబడిపోయింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమా భవిష్యత్తు ఎలా వుంటుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. తమిళంలోనూ అరా కొరా సినిమాలు చేస్తున్నప్పటికీ నిధి అగర్వాల్‌కి రావల్సిన స్టార్ డమ్ దక్కడం లేదు.
ఈ తరుణంలో ధనుష్ సరసన నటించాలని వుందంటూ నిధి అగర్వాల్ తన మనసులోని మాట బయటపెట్టింది. ధనుష్‌తో ఛాన్స్ వస్తే జీరో రెమ్యునరేషన్ అయినా ఫర్వాలేదంటోందీ ముద్దుగుమ్మ. వావ్.! ధనుష్ కోసం నిధి అగర్వాల్ పెద్ద రిస్కే చేయడానికి సిద్ధపడింది.. అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!







