Dhs30 మిలియన్ గెలుచున్న భారత వ్యక్తి..

- December 05, 2022 , by Maagulf
Dhs30 మిలియన్ గెలుచున్న భారత వ్యక్తి..

అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ ర్యాఫిల్ లో భారత వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. శనివారం సాయంత్రం అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన లాటరీ డ్రాలో షార్జాలో ఉండే భారత ప్రవాసుడు ఏకంగా 30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.తీరా లాటరీ నిర్వాహకులు అతనికి కాల్ చేసి ఈ విషయం చెబుదామనుకుంటే ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందట.వివరాల్లోకి వెళ్తే.. షార్జాలో ఉండే భారత ప్రవాసుడు కథార్ హుస్సేన్ నవంబర్ 6వ తేదీన 246 సిరీస్‌లో 206975 నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్‌ ద్వారా కొన్నాడు.ఇంకో విషయం ఏంటంటే 2 టికెట్లు కొంటే.. ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్  సందర్భంగా కథార్ ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

ఇక్కడే అతనికి అదృష్టం కలిసొచ్చింది.కథార్‌కి ఫ్రీగా వచ్చిన టికెట్‌కే (నం.206975) ఈ జాక్‌పాట్ తగలడం విశేషం.ఇక డ్రాలో విజేతగా నిలిచిన భారతీయుడికి షో హోస్ట్ రిచర్డ్ ఫోన్ చేశారు.కానీ, ఆ సమయంలో అతడి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దాంతో ఇతర మార్గాల్లో కథార్‌కి ఈ విషయాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com