వీరప్పన్ ఫై చిత్రం ప్రారంభం
- June 18, 2015
గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన స్మగ్లర్ వీరప్పన్. అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభించినట్లు రాంగోపాల్ వర్మ గురువారం ట్విట్టర్లో వెల్లడించారు. వీరప్పన్ వేట కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు... ఆ క్రమంలో అతడిని మట్టుబెట్టడం కథాంశంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. గంధపు చెక్కల వీరప్పన్ కోసం ప్రభుత్వం చేపట్టిన వేట అప్పట్లో ఆసియా ఖండంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో శివరాజుకుమార్ ఉన్నతాధికారిగా కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వీరప్పన్ పాత్రధారిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఎంపిక చేసిన విషయం విదితమే. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగశెట్టి, పరుల్ యాదవ్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం తెరకెక్కించే క్రమంలో రాంగోపాల్ వర్మ... వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిశారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







