‘చంద్రముఖి 2’ కంగనాతో మావులుగా వుండదు.!
- December 06, 2022
2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది.
ఆ సినిమాలోని పాత్రలు ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చంద్రముఖి పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోంది.
హారర్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లారెన్స్ రాఘవ ఈ సీక్వెల్ రూపొందిస్తున్నారు. చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తోంది.
లేటెస్టుగా కంగనా చంద్రముఖి గెటప్‌లో వున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది. అఫ్కోర్స్ ఈ పాత్రలో ఎవరు కనిపించినా హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
అలాంటిది కంగనా ఈ పాత్ర పోషిస్తే.. ఆ పాత్ర తాలూకు ప్రాధాన్యత వేరే లెవల్‌కి వెళ్లిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాని లారెన్స్ రాఘవ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రజనీకాంత్ పాత్రలో లారెన్స్ కనిపిస్తున్నారు.
కథా, కమామిషు ఎలా వుండబోతున్నాయో, సూపర్ డూపర్ హిట్ అయిన ‘చంద్రముఖి’ లెగసీని ఈ సినిమా ఎలా కంటిన్యూ చేయనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం









