బాలయ్య సరసన బంపర్ ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయ్.!
- December 08, 2022
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా లేటెస్టుగా ప్రారంభమైంది. ‘NBK 108’ గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్య పెప్పర్ సాల్ట్ లుక్స్‌తో కనువిందు చేయబోతున్నారు.
తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఫన్ టోన్‌లో రూపొందబోయే ఈ సినిమాలో హీరోయిన్గా ఓ తెలుగమ్మాయ్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
ఆమె ఎవరో కాదు, ‘ట్యాక్సీవాలా’ భామ ప్రియాంక జవాల్కర్. అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ ముద్దుగుమ్మ పేరు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
‘ట్యాక్సీవాలా’, ‘తిమ్మరుసు’, ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ సినిమాలతో క్రేజ్ దక్కించుకున్న ప్రియాంకకు నిజంగా బాలయ్య పక్కన ఛాన్స్ దక్కినట్లయితే, ఈ ఆఫర్ ఒకింత సాహసమే అని చెప్పాలి.
ఇంతవరకూ యంగ్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ప్రియాంక, బాలయ్య వంటి సీనియర్ హీరో పక్కన నటిస్తే, ఆ తర్వాత అమ్మడి ఫ్యూచర్ ఎలా వుండబోతోందో.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







