టీమిండియా కొత్త షెడ్యూల్ విడుదల చేసిన BCCI
- December 08, 2022
ఢాకా: ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పాల్గొంటున్న టీమిండియా, ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత కూడా వరుసగా సిరీస్‌లు ఆడబోతుంది. వచ్చే జనవరి నుంచి శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మూడు సిరీస్‌లు ఆడనుంది. ఇందులో వన్డేలు, టీ20లు, టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.
జనవరి నుంచి మార్చి వరకు ఈ సిరీస్‌లు జరుగుతాయి. వీటిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఉంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఇదే చివరి సిరీస్. ఆ తర్వాత ఈ ట్రోఫీ రద్దవుతుంది. ఇవన్నీ దేశీయంగా జరిగే సిరీస్‌లే. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. షెడ్యూల్ వివరాలు.. శ్రీలంక సిరీస్: ఇందులో మూడు టీ20లు, మూడు వన్డేలు ఉంటాయి. జనవరి 3,5,7 తేదీల్లో టీ 20లు, 10,12,15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. తర్వాత న్యూజిలాండ్ సిరీస్ ఆరంభమవుతుంది. ఇందులో కూడా మూడు వన్డేలు, మూడు టీ20లు ఉంటాయి. జనవరి 18, 21, 24 తేదీల్లో మూడు వన్డేలు, జనవరి 27, 29, ఫిబ్రవరి 1న మూడు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభమవుతుంది. ఇందులో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఉన్నాయి.
ఫిబ్రవరి 9-13 వరకు మొదటి టెస్ట్, 17-21 వరకు రెండో టెస్ట్, మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. తర్వాత మార్చి 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో జనవరి 18న జరిగే మొదటి వన్డే హైదరాబాద్‌లో, ఆస్ట్రేలియాతో మార్చి 19న జరిగే రెండో వన్డే విశాఖపట్నంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







