తీరం దాటనున్నమాండూస్ తుపాను..కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
- December 08, 2022
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి మాండూస్ గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుపాను తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఇది చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయింది.
ఇక తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షను నిర్వహిస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తుపాను పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన ఉందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







