IMD వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో చేరిన బహ్రెయిన్

- December 09, 2022 , by Maagulf
IMD వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో చేరిన బహ్రెయిన్

బహ్రెయిన్: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (IMD) వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ సెంటర్ జారీ చేసిన వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ (WTR)లో బహ్రెయిన్ తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా 35వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 13 సూచికలలో బహ్రెయిన్ అగ్ర 15 దేశాలలో స్థానం పొందింది. దేశాలు ఏ మేరకు అభివృద్ధి, ప్రతిభను ఆకర్షిస్తాయన్న అంశాల ఆధారంగా WTR ర్యాంకింగ్ లను నిర్ణయిస్తుంది. మూడు అంశాలలో (పెట్టుబడి, అభివృద్ధి, అప్పీల్, రెడీనెస్) ఆధారంగా 63 దేశాలకు ర్యాంక్ ఇస్తుంది. స్కిల్డ్ లేబర్ ఇండికేటర్‌లో ప్రపంచవ్యాప్తంగా కింగ్‌డమ్ 5వ స్థానంలో నిలిచింది. బహ్రెయిన్ ఫైనాన్స్ స్కిల్స్ సూచికలో ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో నిలిచింది. భాషా నైపుణ్యాల సూచికలో ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో బహ్రెయిన్ నిలిచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com