‘గుర్తుందా శీతాకాలం’: మూవీ రివ్యూ
- December 09, 2022సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. మేఘా ఆకాష్, కావ్య తదితరులు నటించారు. కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. కన్నడ హిట్ మూవీ ‘మాక్ టెయిల్’కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథా కమామిషు ఎలా వుందో తెలియాలంటే, కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
కర్ణాటక హిల్ స్టేషన్‌లో సత్యదేవ్, మేఘా ఆకాష్‌ని కలుస్తాడు. అనుకోకుండా కలిసిన ఈ ఇద్దరు అపరిచిత వ్యక్తులు తమ పర్సనల్ ఇష్యూస్‌ని షేర్ చేసుకుంటారు. తర్వాత బెంగుళూరుకు ప్రయాణం కడతారు. ఆ ప్రయాణంలో తన భార్య (తమన్నా) గురించిన ఆసక్తికరమైన విషయాలను మేఘా ఆకాష్‌తో పంచుకుంటాడు సత్యదేవ్. అలా కలిసిన ఈ అపరిచిత వ్యక్తులిద్దరి ప్రయాణం ఎలా సాగింది.? అసలు తమన్నా స్టోరీ ఏంటీ.? తెలియాలంటే ‘గుర్తుందా శీతాకాలం’ ధియేటర్లలో చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
సత్యదేవ్ మంచి నటుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విషయాన్ని ఇంతవరకూ చేసిన సినిమాలతో సత్యదేవ్ ప్రూవ్ చేసుకోవడమే కాదు, మెగాస్టార్ చిరంజీవినే మెప్పించి ఏకంగా ఆయన సినిమాలో మెయిన్ విలన్ ఛాన్స్ కొట్టేసిన నటుడు సత్యదేవ్. సో, ఆ ఇమేజ్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాలోనూ తన పాత్రను చేసుకుంటూ పోయాడు సత్యదేవ్. ఇక, తమన్నా డీ గ్లామర్ రోల్‌లో కనిపించింది కానీ, ఆమె తన నటనా అనుభవం అంతా రంగరించి మెప్పించింది. సత్యదేవ్‌తో రొమాంటిక్ సన్నివేశాల్లో అవలీలగా నటించేసింది. మేఘా ఆకాష్, ఇతర పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
కాల భైరవ మ్యూజిక్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకి కావల్సిన చోట రావల్సిన హైప్ క్రియేట్ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ అందంగా వుంది. ఇక, డైరెక్టర్ విషయానికి వస్తే, ఒరిజినల్ ఫ్లేవర్‌ని ఏమాత్రం చెడగొట్టకుండా మక్కీకి మక్కీ దించేశాడు డైరెక్టర్. అయినా ఎందుకో రావల్సిన ఎమోషన్ రాబట్టలేకపోయాడు. మంచి నటులున్నా సరే, ఎమోషన్ అంతగా కనెక్ట్ కాలేదు. అక్కడక్కడా సాగతీత సీన్లు విసుగు పుట్టిస్తాయ్. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా వుండి వుంటే బాగుంటుందనిపిస్తుంది. కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన నాగ శేఖర్, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకున్నాడు. కానీ, ఆయన ప్రయత్నం హండ్రెడ్ పర్సంట్ ఫలించిందని చెప్పలేం ‘గుర్తుందా శీతాకాలం’తో.
ప్లస్ పాయింట్స్:
సత్యదేవ్, తమన్నా నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
కనెక్ట్ కాని ఎమోషనల్ సీన్లు
ఆకట్టుకోలేని డైలాగులు
చివరిగా: గుర్తు పెట్టుకునేంతలా లేదు ‘శీతాకాలం’.!
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్‌లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!