బిఆర్ఎస్ జెండాను ఆవిష్క‌రించిన సిఎం కెసిఆర్

- December 09, 2022 , by Maagulf
బిఆర్ఎస్ జెండాను ఆవిష్క‌రించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆ పార్టీ అధినేత‌,సిఎం కెసిఆర్ ఆవిష్క‌రించారు. జెండాను ఆవిష్క‌రించిన స‌మ‌యంలో తెలంగాణ భ‌వ‌న్ ప‌టాకులు, డ‌ప్పుల‌తో ద‌ద్ధ‌రిల్లిపోయింది. జై కెసిఆర్, జై భార‌త్ నినాదాలు మార్మోగాయి. జెండా ఆవిష్క‌రణ కంటే ముందు బిఆర్ఎస్ ప‌త్రాల‌పై కెసిఆర్ సంత‌కం చేశారు. అంత‌కు ముందు ముందు భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వేద పండితుల ఆశీర్వ‌చ‌నాలు కెసిఆర్ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాగా, టిఆర్ఎస్ జెండాకు, బిఆర్ఎస్ జెండాకు మధ్య ఉన్న తేడాలు ఉన్నాయి. జెండాలో తెలంగాణ పటం స్థానంలో భారతదేశ చిత్రపటాన్ని ఉంచారు. జై తెలంగాణకు బదులుగా జై భారత్ అని పేర్కొన్నారు. జెండాలో కారు గుర్తు కనిపించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com