‘హిట్ 2’కి అదృష్టం అలా కలిసొచ్చింది.!
- December 10, 2022
విశ్వక్ సేన్ హీరోగా డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘హిట్’ సినిమా అనూహ్యంగా విజయం అందుకుంది. సీరియస్ టోన్‌లో సాగుతూనే హీరోకి సెపరేట్ ఆటిట్యూడ్ అద్దాడు డైరెక్టర్.
ఆ ఆటిట్యూడే ‘హిట్’ని సక్సెస్ బాటలో నిలిపిందని చెప్పొచ్చు. ఫస్ట్ కేస్ ఇచ్చిన ఎంకేజ్మెంట్తో ‘హిట్ ది సెకండ్ కేస్’ అంటూ ఇంకో క్రైమ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారు రీసెంట్గా.
అడవి శేష్ ఈ సిరీస్‌కి తన ఆటిట్యూడ్ చూపించాడు. ఈ ఆటిట్యూడ్ స్టైలింగ్నీ ఆడియన్స్ ఆదరించారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో తమదైన శైలిలో సినిమాని ప్రమోట్ చేశారు.
నాని నిర్మాణం, శైలేష్ కొలను దర్శకత్వం, అడవి శేష్ స్టైలింగ్.. అన్నీ వెరసి ఈ సినిమాతో రిలీజైన మరే సినిమా బరిలో నిలవలేకపోవడంతో ‘హిట్ 2’ కి కాలం బాగా కలిసొచ్చింది.
జస్ట్ ఏదో క్రైమ్ థ్రిల్లర్ అన్నట్లు లైట్ తీసుకోకుండా, కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు సైతం ఈ సినిమాకి ఎట్రాక్ట్ అవుతున్నారు. దాంతో, మొదటి వారం ముగిసినా, రెండో వారం కూడా హిట్ 2 బాగానే జోరు ప్రదర్శించేలా కనిపిస్తోంది. అన్నట్లు అడవి శేష్‌కి ఓవర్సీస్లోనూ కాస్త ఫాలోయింగ్ ఎక్కువే. దాంతో, అక్కడ కూడా ఈ సినిమా బాగానే నిలదొక్కుకుంది. ఈ లోపు చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడంతో, ‘హిట్ 2’ మరో వారం రోజులు ధియేటర్లలో కంటిన్యూ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్‌ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్‌లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









