మొరాకో ఆటతీరు అబ్బురపరుస్తూనే ఉంది: షేక్ మహమ్మద్
- December 11, 2022
యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై విజయం సాధించిన మొరాకో ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందించారు. "మొరాకో ప్రపంచ కప్‌లో మరో చారిత్రాత్మక విజయంతో మమ్మల్ని అబ్బురపరుస్తూనే ఉంది... మొరాకో హీరోలు అరబ్ కలను సాకారం చేసినందుకు అభినందనలు" అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా మొరాకో జట్టు విజయంపై అభినందనలు తెలిపారు. " ఓ మొరాకో... అభినందనలు. మరోసారి మీరు చరిత్ర సృష్టించారు. ప్రతి అరబ్.. ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులను సంతోషపరిచారు" అని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు.
దుబాయ్ ఉప పాలకుడు, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా మొరాకో జట్టుపై ప్రశంసలు కురిపించారు. “ఈ చారిత్రాత్మక విజయానికి మొరాకో నాయకత్వాన్ని, ప్రజలను మేము అభినందిస్తున్నాము. మొరాకో ప్రదర్శన, అరబ్ ఫుట్‌బాల్‌కు అపూర్వమైన విజయం.” అని షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







