మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించిన ప్రధాని మోడీ
- December 11, 2022
నాగపూర్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాగ్‌పూర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభించారు. ఇది దేశంలో అందుబాటులోకి వచ్చిన ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. దీనితోపాటు రెండు మెట్రో రైళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెట్రో రైలు టిక్కెట్ కొనుక్కుని, కొంతమంది పిల్లలతో కలిసి ప్రయాణించారు. నాగ్‌పూర్‌లో ఆదివారం నాగ్‌పూర్‌లోని ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్రి వరకు ఏర్పాటైన మెట్రో ఫేజ్-1 ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ రెండు మెట్రో రైళ్లను ప్రారంభించారు. అనంతరం ఈ రైళ్లను జాతికి అంకితం చేశారు. తర్వాత మెట్రో ఫేజ్-2కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖాప్రి నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు ప్రయాణించే ఒక రైలును, ప్రజాపతి నగర్ నుంచి లోకమాన్య నగర్ వరకు వెళ్లే మరో రైలును ప్రధాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెట్రో స్టేషన్లో టిక్కెట్ కొనుక్కున్న ప్రధాని, కొంతమంది విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







