ఈ డబుల్ రోల్స్ కాపీ కొట్టుడేందిరా బాబూ.!
- December 12, 2022
సంపత్ నంది దర్శకత్వంలో అప్పుడెప్పుడో వచ్చిన ‘గౌతమ్ నందా’ సినిమా గుర్తుంది కదా. గోపీచంద్ డబుల్ రోల్లో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదనుకోండి.
ఇప్పుడీ సినిమా ముచ్చట ఎందుకొచ్చిందంటే, ఇదే సినిమా కథని తలపిస్తూ మరో సినిమా.. కాదు, కాదు రెండు సినిమాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయ్.
అందులో ఒకటి మాస్ రాజా రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం ఒకటి కాగా, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ’ ఇంకొకటి. ఇటీవల రిలీజైన ఈ సినిమాల ప్రోమోలు ‘గౌతమ్ నందా’ సినిమాని కాపీ కొట్టి తెరకెక్కాయంటూ ప్రచారం జరుగుతోంది.
అవును నిజమే, అదే డబుల్ రోల్.. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్.. ఆల్రెడీ వచ్చేసిన కాన్సెప్ట్‌లోనే మళ్లీ ఇంకో సినిమాని కాదు కాదు, రెండు సినిమాల్ని ఎలా తెరకెక్కించారబ్బా.! ఫులిష్గా అంటూ సినీ జనం గగ్గోలు పెడుతున్నారు.
విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ అయితే ‘గౌతమ్ నందా’కి మక్కీకి మక్కీ దించేశారంటూ విమర్శలు వస్తున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







