విలన్ అవతారమెత్తనున్న విశాల్.! కానీ.!
- December 12, 2022
తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విశాల్ గురించి ఈ మధ్య ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. మరో స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 67వ సినిమాలో విశాల్ విలన్‌గా నటిస్తున్నాడనేది ఆ ప్రచారం సారాంశం.
అయితే, అది వుత్త ప్రచారం అయితే కాదట. నిజంగానే ఆ చిత్ర యూనిట్ విశాల్‌తో సంప్రదింపులు చేసిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రంలో విశాల్‌ని విలన్‌గా తీసుకోవాలనుకున్నారట.
అయితే, ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్‌తో విశాల్ ఆ ఆఫర్ వదులుకున్నాడనీ ఆయనే స్వయంగా కన్‌ఫామ్ చేశాడు. అయితే, భవిష్యత్తులో విజయ్‌తో కలిసి ఖచ్చితంగా పని చేయాలని కోరుకుంటున్నా.. అని విశాల్ చెప్పాడు.
ఇంతవరకూ హీరోగానే సత్తా చాటిన విశాల్, కథ నచ్చితే, విలన్‌గా నటించడానికి ఎలాంటి అభ్యంతరాల్లేవని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. అంటే, త్వరలోనే విశాల్ విలన్ అవతార్ చూడొచ్చన్న మాట అని విశాల్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేశారు.
తాజా వార్తలు
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..







