హూప్స్.! ఇనయాని ఎలిమినేట్ చేసేశావ్గా బిగ్‌బాస్.!
- December 12, 2022
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 క్లైమాక్స్‌కి చేరుకుంది. కేవలం ఒకే ఒక్క వారం మిగిలి వుంది .అది కూడా ఫినాలే వీక్ మాత్రమే. ఇక, చివరి ఎలిమినేషన్లో భాగంగా ఇనయా సుల్తానా హౌస్ నుంచి బయటికి వచ్చేసింది.
నిజానికి ఈ ఎలిమినేషన్లో కీర్తి కానీ, శ్రీ సత్య కానీ అవుట్ అవుతుందని భావించారంతా. తెర వెనక ఏం జరిగిందో ఏమో కానీ, లాస్ట్ మినిట్‌లో ఇనయాని హౌస్ నుంచి బయటికి పంపించేశాడు బిగ్‌బాస్.
హౌస్‌ని వీడుతూ, శ్రీహాన్ బిగ్‌బాస్ విన్నర్ కావాలని కోరుకుంది ఇనయా. హౌస్‌లో వున్నన్నాళ్లూ టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకున్న ఇనయా, శ్రీహాన్‌లు.. హౌస్‌కి కావల్సినంత స్టఫ్ ఇచ్చారు.
అయితే, చివరిగా శ్రీహాన్‌ని బిగ్‌బాస్ విన్నర్‌గా చూడాలనుకుంటున్నా.. అని ఇనయా చెప్పడం విశేషం. ఇనయా నోట శ్రీహాన్ మాట అలా వచ్చినందుకు శ్రీహాన్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







