యూఏఈ వెదర్ అప్డేట్: మేఘావృతమై వర్షం కురిసే అవకాశం

- December 13, 2022 , by Maagulf
యూఏఈ వెదర్ అప్డేట్: మేఘావృతమై వర్షం కురిసే అవకాశం

యూఏఈ: వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, తూర్పు ప్రాంతాలలో ముఖ్యంగా తీరంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమాన ఉన్న ద్వీపాలపై తేలికపాటి వర్షపాతం వచ్చే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది.

అబుధాబి, దుబాయ్ రెండింటిలోనూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 27°C, కనిష్టంగా 17°C చేరుకునే అవకాశం ఉంది. కొన్ని అంతర్గత ప్రాంతాలలో రాత్రి, బుధవారం ఉదయం తేమగా ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయి. అరేబియా గల్ఫ్‌లో సముద్రంలో గాలుల తీవ్రత ఓ మోస్తరుగానూ, ఒమన్ సముద్రంలో స్వల్పంగానూ ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com