డిసెంబర్ 29 వరకు సౌదీ ఫీస్ట్ ఫుడ్ ఫెస్టివల్
- December 13, 2022
రియాద్: సౌదీ క్యూలినరీ ఆర్ట్స్ కమిషన్ సౌదీ ఫీస్ట్ ఫుడ్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ రియాద్‌లో ప్రారంభం కానుంది. ఇది డిసెంబర్ 29 వరకు సందర్శకులను ఆకట్టుకోనున్నది. ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా సౌదీ అరేబియా ఆహార వారసత్వాన్ని తెలిపే వంటకాలను ప్రదర్శించనున్నారు. వీటితోపాటు అనేక రకాల సౌదీ వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సౌదీ చెఫ్‌లు తమ సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రదర్శించి ప్రత్యేకమైన వంటకాలను ప్రదర్శిస్తారు. సౌదీ ఫీస్ట్ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన వేదికపై వంటల పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రెస్టారెంట్ జోన్ ఫెస్టివల్ జోన్‌లలో ఇది అతిపెద్దదిగా పేరుగాంచింది. 200 కంటే ఎక్కువ ఫుడ్ కాన్సెప్ట్‌లను అందించే రెస్టారెంట్‌లు, ఫుడ్ కార్ట్‌లను కలిగి ఉన్నది. అంతేకాకుండా కుకరీ పుస్తకాలను విక్రయించే బోటిక్‌లు, ఫెస్టివల్ గుర్తింపుతో వివిధ ఉత్పత్తులను విక్రయించే సౌక్‌లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
తాజా వార్తలు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు







