సెంట్రల్ యూనివర్సిటీల్లో 11,000 అధ్యాపక పోస్టులు ఖాళీ..
- December 13, 2022
            న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్12,2022) మంత్రి లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలోని 45 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా, 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఐఐటీల్లో 11,170 పోస్టులు మంజూరవ్వగా, 4,502 ఖాళీ పోస్టులున్నాయని పేర్కొన్నారు.
ఐఐఎంలలో మంజూరైన పోస్టులు 1,566 కాగా, 493 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పారు.కేంద్ర యూనివర్సిటీలు, ఐఐఎంలలో ఖాళీగా ఉన్న పోస్టులో 961 పోస్టులు ఎస్సీ రిజర్వ్ డ్, 578 పోస్టులు ఎస్టీ రిజర్వ్ డ్, 1657 పోస్టులు ఓబీసీ కేటగిరి కింద ఉన్నాయని వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరిలో వరుసగా 643, 301 ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్ సీఎల్ టీ)లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ సీఎల్ టీకి వేర్వేరు ప్రాంతాల్లో బెంచులు ఉన్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికి గానూ మొత్తం 1 ప్రెసిడెంట్ తోపాటు 31 మంది జ్యూడీషియల్, 31 మంది టెక్నికల్ సభ్యులు ఉండాలన్నారు. కానీ ప్రస్తుతం 1 ప్రెసిడెంట్ తోపాటు 18 మంది జ్యూడీషియల్, 19 మంది టెక్నికల్ సభ్యులే పని చేస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







