నకిలీ వస్తువులను విక్రయించిన సంస్థకు RO1,000 జరిమానా
- December 14, 2022
మస్కట్: ధహీరా గవర్నరేట్‌లో నకిలీ వస్తువులను విక్రయించినందుకు వాణిజ్య సంస్థపై RO1,000 పరిపాలనాపరమైన జరిమానా విధించినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) వెల్లడించింది. వివిధ మార్కెట్లు, దుకాణాలు, వాణిజ్య కేంద్రాలలో డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీ సందర్శనల సందర్భంగా, ధహీరా గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం నకిలీ వస్తువులను విక్రయించే వాణిజ్య సంస్థపై దాడి చేసిందని పేర్కొంది.
ఒక వాణిజ్య సంస్థ నకిలీ, మోసపూరిత వస్తువులతో పాటు వివరణాత్మక డేటాను కలిగి లేని వస్తువులను విక్రయించి, ప్రదర్శించినట్లు కనుగొనబడిందని తెలిపింది. దీంతో ఉల్లంఘించిన వస్తువులను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీపీఏ పేర్కొంది. వినియోగదారుల రక్షణ చట్టం, దాని నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు సంస్థపై RO1,000 పరిపాలనాపరమైన జరిమానా విధించినట్లు సీపీఏ తెలిపింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







