షార్జాలో 3 నెలల్లో 10 ఫుడ్ ఔట్‌లెట్స్ మూసివేత
- April 26, 2016
షార్జా మునిసిపాలిటీ 1,211 టన్నుల ఆహార పదార్థాలు నిబంధనల దృష్ట్యా ఆరోగ్యానికి హానికరమైనవని తేల్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని వినియోగదారులకు సరఫరా చేస్తున్నందుకుగాను ఈ ఏడాది ఇప్పటిదాకా 10 పుడ్ ఔట్‌లెట్స్‌ని తాత్కాలికంగా మూసివేశారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు సెంట్రల్ ఫుడ్ లేబరేటరీస్ డాక్టర్ షైకా రషా అల్ ఖాసిమి మాట్లాడుతూ, సార్జా మునిసాలిటీకి చెందిన హెల్త్ డిపార్ట్‌మెంట్ 12,875 తనిఖీలను నిర్వహించిందనీ, ఫుడ్ ఔట్‌లెట్స్, రెస్టారెంట్స్, కేఫిటేరియాలు, తయారీదారులు, ఐస్‌క్రీమ్ షాపులు, సంప్రదాయ వంటశాలలు, ఫిష్ మరియు మీట్ అలాగే వెజిటబుల్ మార్కెట్స్, హనీ అండ్ డేట్ ఫ్రూట్ దుకాణాలు, గ్రాసరీస్, సూపర్ మార్కెట్స్, వీటితోపాటుగా ఇంపోర్టర్స్‌పై ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,211 టన్నుల ఆహార పదార్థాల్ని ప్రజారోగానికి హానికరంగా గుర్తించి, నాశనం చేశారు. స్కూల్ క్యాంటీన్లతోపాటు, ఆహార పదార్థాల్ని రవాణా చేసే వాహనాల్ని కూడా తనిఖీ చేశారు అధికారులు. గత నెలలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కొత్త ప్రోగ్రామ్ రెండో ఫేజ్ లాంఛ్ చేశారు. ఫుడ్ ఇండస్ట్రీ బాగా వృద్ధి చెందుతోందనీ, ఈ పరిస్థితుల్లో నిబంధనల్ని సమర్థవంతంగా పాటించేలా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని హెల్త్ సెక్షన్ డైరెక్టర్ సాజా అల్ ముల్లా చెప్పారు. ఎమిరేట్‌లో 183 కొత్త ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి మునిసిపాలిటీ అనుమతిచ్చింది. హెల్త్ సెక్షన్ డిస్కౌంట్ ప్రమోషన్స్‌కి సంబంధించి 224 అప్లికేషన్స్‌ని అప్రూవ్ చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







