ప్రపంచంలో 2వ అత్యంత ఆకర్షణీయమైన నగరంగా దుబాయ్
- December 15, 2022
దుబాయ్: యూరోమానిటర్ ఇంటర్నేషనల్ టాప్ 100 సిటీ డెస్టినేషన్స్ ఇండెక్స్ 2022 ప్రకారం.. దుబాయ్ ప్రపంచంలోనే పర్యాటకం కోసం రెండవ అత్యంత ఆకర్షణీయమైన నగరంగా నిలిచింది. ఆర్థిక, వ్యాపార పనితీరు, పర్యాటక పనితీరు, పర్యాటక మౌలిక సదుపాయాలు, పర్యాటక విధానం, ఆకర్షణ, ఆరోగ్యం, భద్రత, స్థిరత్వం అనే అంశాల అధ్యయనం ఆధారంగా నివేదికను రూపొందించారు. "పర్యాటక పనితీరు, ఆరోగ్యం, భద్రత పరంగా దుబాయ్ చాలా బాగా పనిచేసింది. పర్యాటక విధానం, ఆకర్షణీయత, పర్యాటక మౌలిక సదుపాయాల పరంగా దుబాయ్ మంచి స్థితిని కలిగి ఉంది. దీని కారణంగా ఇండెక్స్‌లో దుబాయ్ టాప్ ప్లేస్ లో స్థానం పొందింది.”అని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ నడేజ్డా పోపోవా తెలిపారు. టాప్ 100 సిటీ డెస్టినేషన్స్ ఇండెక్స్ 2022లో పారిస్ మొదటి స్థానంలో ఉన్నది. దుబాయ్ తర్వాతి స్థానాల్లో ఆమ్‌స్టర్‌డామ్, మాడ్రిడ్, రోమ్, లండన్, మ్యూనిచ్, బెర్లిన్, బార్సిలోనా, న్యూయార్క్ టాప్ 10లో ఉన్నాయి.
2021-22లో కోవిడ్ ఆంక్షల సడలింపు తర్వాత ఎమిరేట్‌లో ట్రావెల్, టూరిజం రంగాలు పుంజుకున్నాయి. తాజా వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అధ్యయనం ప్రకారం, 2022లో ప్రపంచంలోని అన్ని నగరాల కంటే అత్యధిక పర్యాటక వ్యయం ఎమిరేట్ $29.4 బిలియన్లకు (Dh108 బిలియన్) చేరుకుంటుందని అంచనా వేసింది. అలాగే OAG విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ సంవత్సరం టాప్ 10 అత్యంత రద్దీగా ఉండే విమాన ప్రయాణ మార్గాలలో ఐదవ స్థానంలో దుబాయ్ స్థానం సంపాదించింది.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







