'18 పేజెస్' ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది
- December 15, 2022
హైదరాబాద్: కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ , అనుపమ లు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు 18 పేజెస్ మూవీ తో ఈ నెల 23 న రాబోతున్నారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా బ్రేక్ పడుతూ వస్తూ ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావోస్తుండడం తో ప్రమోషన్స్ ను స్పీడ్ చేసారు.
ఇప్పటికే సినిమాలోని సాంగ్ సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా ఈ చిత్ర యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.అనుపమ ట్రైలర్ రిలీజ్ డేట్ ని ఒక ఉత్తరంలో రాసి నిఖిల్ కి అందజేసిన వీడియోని షూట్ చేసి విడుదల చేశారు. ఇది ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.
మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







