అపోలో హాస్పిటల్ లో డాక్టర్ రవిచంద్ర చే అరుదైన శస్త్రచికిత్స
- December 16, 2022
విశాఖపట్నం: స్థానిక అపోలో హాస్పిటల్, అరిలోవ, విశాఖపట్నం నందు అవయవ వక్రతను సరిచేసే అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి గత సెప్టెంబర్-2022 నెలలో విజయ వంతంగా నిర్వహించారు.ఈ శస్త్ర చికిత్స పూర్వపరాలు పరిశీలిస్తే, శ్రీకాకుళం నకు చెందిన 4 సంవత్సరాల పాప మాధవి పుట్టుకతోనే ఎడమ వైపు కాలు (అవయవం) వక్రతతో జన్మించటం వలన నడవలేక పోయేది, తల్లితండ్రులు పాపను అనేక హాస్పిటల్స్ నందు చూపించిన ఫలితం లభించలేదు. చివరగా పాపను తీసుకుని విశాఖపట్నం లోని అపోలో హాస్పిటల్, అరిలోవ నందు డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి ని సంప్రదించారు. ఆయన ఈ కేసును చాల సీరియస్ గా తీసుకుని తోటి డాక్టర్లను సంప్రదించి, పాపకు క్లినికల్ పరీక్షలు, ఎక్స్-రేలు మరియు MRI చేయించి, పాపకు మోకాలు చిప్ప సరియైన స్థితిలో లేదని, వక్రంగా ఉందని గుర్తించారు.
ఆర్థోపెడిక్ రంగంలో ఇటువంటి కేసు రావటం ఇదే మొదటిసారి, కేసు నందలి క్లిష్టతను గుర్తించిన డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి ప్లాస్టిక్ సర్జన్ అయిన డాక్టర్.PRK ప్రసాద్ తో కలిసి పాపకు అతిక్లిష్టమైన శస్త్ర చికిత్సను సెప్టెంబర్ నెలలో నిర్వహించారు.ఇప్పుడు పాప బాగా కోలుకుని ఎలాటి నడక సాధనాలు సాయం లేకుండా చక్కగా నడవ గలుగుతున్నాది.అపోలో హాస్పిటల్ నందలి అనస్థీషియా, రేడియాలజి మరియు నర్సింగ్ బృందం రోగ నిర్ధారణలో చూపిన చొరవ మరియు సమిష్టి సహకారంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి వివరించారు.ఇటువంటి శస్త్ర చికిత్స నిర్వహించటానికి ముందు అనేక మంది నిపుణులు బృందం కూర్చొని విశ్లేషణ/చర్చలు జరపవలసిన ఆవశ్యకత ఉంటుందని డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి తెలిపారు.ఇలాంటి క్లిష్టమైన కేసులు నిర్వహణకు అపోలో హాస్పిటల్ అన్ని ఆధునిక సదుపాయములు మరియు అత్యంత నిపుణులైన వైద్య మరియు నర్సింగ్ సిబ్బందిని కలిగి ఉందని, కనుకనే ఇంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను సులభంగా చేయగలిగామని డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి అన్నారు.ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించి నందు తనకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

తాజా వార్తలు
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!







