గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్: అరబ్ దేశాలలో యూఏఈకి అగ్రస్థానం
- December 16, 2022
యూఏఈ: మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాలెడ్జ్ ఫౌండేషన్ (MBRF) గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ (GKI) 2022 ఫలితాలను యూత్ నాలెడ్జ్ ఫోరమ్ సందర్భంగా ప్రకటించారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP) సహకారంతో దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) చైర్పర్సన్, దుబాయ్ కౌన్సిల్ సభ్యుడు బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఫలితాలను విడుదల చేశారు.
గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ (GKI) 2022 లో 132 దేశాలకు ర్యాంకింగ్ లను ఇచ్చారు. ఇందులో 11 అరబ్ దేశాలు, 155 వేరియబుల్స్ ఉన్నాయి. యూఏఈ అరబ్ ప్రపంచంలో మొదటి స్థానంలో.. అంతర్జాతీయంగా 25వ స్థానంలో నిలిచింది. అరబ్ దేశాలలో యూఏఈ తర్వాత ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ రాజ్యం ఉన్నాయి.
యూఏఈ ప్రపంచవ్యాప్తంగా 18 సూచికలు, ఉప సూచికలలో మొదటి స్థానంలో ఉంది. 54 సూచికలు, ఉప సూచికలలో మొదటి పది స్థానాల్లో ఒకటిగా ఉంది. ఇండెక్స్ ప్రకారం.. యూఏఈ నాలెడ్జ్ ఇండికేటర్లో మొదటి ర్యాంక్, ఎకానమీ ఇండికేటర్లో 11వ ర్యాంక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసిటి) ఇండికేటర్లో 15వ ర్యాంక్, ఇన్నోవేషన్ మరియు ఆర్&డిలో ఇరవై తొమ్మిదో ర్యాంక్, . ప్రీ-యూనివర్శిటీ విద్య, ఉన్నత విద్య, ఎనేబుల్ పర్యావరణంలలో వరుసగా 30, 44, 46వ ర్యాంక్లను పొందింది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







