ఫిఫా ప్రపంచ కప్: రిఫరీపై మొరాకో ఫిర్యాదు
- December 16, 2022
దోహా: ఫ్రాన్స్‌తో బుధవారం జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో పరాజయం పాలైన తరువాత రాయల్ మొరాకో ఫుట్‌బాల్ ఫెడరేషన్ (FRMF) ఖతార్‌లో మ్యాచ్ రిఫరీపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేసింది. వీడియో అసిస్టెన్స్ టు ఆర్బిట్రేషన్ (VAR) సిస్టమ్ ను కూడా రిఫరీ ఉపయోగించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు FRMF తెలిపింది. మరోవైపు ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ సమయంలో తీసుకున్న నిర్ణయాలను పున:సమీక్షించడం, రిఫరీ హక్కులకు భంగం కలిగేలా ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని ఫుట్‌బాల్ సమాఖ్య చెబుతోంది.
ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచులో అనేక వివాదాస్పద నిర్ణయాలను రిఫరీ తీసుకోవడం వివాదం అయింది. రిఫరీ ఏకపక్ష నిర్ణయాలు తమ విజయావకాశాలను దెబ్బతీశాయని మొరాకో ఆరోపిస్తోంది. ఫ్రాన్స్ బాక్స్‌లో వింగర్ సోఫియాన్ బౌఫాల్ హెర్నాండెజ్ను ఢీకొట్టినప్పుడు రిఫరీ మొరాకోకు పెనాల్టీకి బదులుగా లెస్ బ్ల్యూస్కి ఫ్రీ-కిక్‌ను ఇచ్చాడు.ప్రత్యామ్నాయ ఆటగాడు సెలిమ్ అమల్లాహ్ ఫ్రీ-కిక్ డెలివరీ కోసం ఎదురుచూస్తూ ఫ్రాన్స్ ఏరియాలో కిందపడ్డప్పుడు రిఫరీ స్పాట్-కిక్ ఇవ్వలేదు, పైగా VAR రివ్యూకు కూడా కాల్ చేయకపోవడంపై మొరాకో నిరసన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







