ఆ ఇద్దరు తమిళ హీరోల మధ్య అలా లొల్లి పెట్టేశావేంటీ ‘రాజా’.!

- December 16, 2022 , by Maagulf
ఆ ఇద్దరు తమిళ హీరోల మధ్య అలా లొల్లి పెట్టేశావేంటీ ‘రాజా’.!

ఈ సంక్రాంతికి ఇద్దరు తమిళ హీరోల సినిమాలు రిలీజ్ అవుతన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ స్టార్ హీరోలే. వారెవరో కాదు. ఒకరు ఇళయ దళపతి విజయ్ కాగా, మరొకరు తలైవా అజిత్. 
విజయ్ సినిమాని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం విషయంలోనే అనేక రకాలుగా రచ్చ జరుగుతోంది టాలీవుడ్‌లో గత కొంతకాలంగా.
ఆ రచ్చ అలా వుండగా, దిల్ రాజు అత్యుత్సాహం ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఆరని చిచ్చులా మారింది. అసలే తమిళ హీరోలు అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది, తన సినిమా అదే విజయ్ సినిమా కోసం తమిళనాడులో ఎక్కువ ధియేటర్లు కావాలని దిల్ రాజు అడిగారట. 
అదేంటీ.! ఎలాగూ ధియేటర్లు బాగానే ఇస్తారు కదా వాళ్ల సినిమా కదా. అయినా ఆ సినిమా నిర్మాత కాబట్టి అడగడంలో తప్పు లేదు కానీ, అడిగే విధానమే ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీసింది. అజిత్ కన్నా విజయ్ పెద్ద హీరో కదా.. అనే అస్ర్రం వదిలారు దిల్ రాజు.
దాంతో, అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. అసలే ఒకరంటే ఒకరికి పడదాయె. దిల్ రాజు స్టేట్‌మెంట్‌తో ఆ గొడవకు మరింత ఆధ్యం పోసినట్లయ్యింది. మరోవైపు హీరోలు అజిత్, విజయ్ కూడా దిల్ రాజు స్టేట్‌మెంట్‌పై గుస్సా అవుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com