ట్రావెల్ అలర్ట్: హాలిడే సీజన్‌కు ‘ఎతిహాద్’ కీలక సూచనలు

- December 17, 2022 , by Maagulf
ట్రావెల్ అలర్ట్: హాలిడే సీజన్‌కు ‘ఎతిహాద్’ కీలక సూచనలు

యూఏఈ: ప్రయాణికులు పీక్ టైమ్‌లో తమ ట్రిప్‌కు సహాయపడటానికి.. ఎతిహాద్ ఎయిర్‌వేస్ సెలవు సీజన్‌కు ముందు బ్యాగేజీ పాలసీలు, సలహాలపై మార్గదర్శకాలతో కూడిన అవగాహన వీడియోను విడుదల చేసింది. అబుధాబి ఎయిర్‌పోర్ట్‌లోని ఎతిహాద్ హబ్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ షేబ్ అల్నజ్జర్ ఎంపికలు, బ్యాగేజీ అలవెన్స్‌లు, ఆన్‌లైన్ చెక్-ఇన్ ప్రయోజనాల గురించి ఆ వీడియోలో సలహాలను అందించారు. టిక్కెట్ రకంతో సంబంధం లేకుండా ఏదైనా బ్యాగ్‌లో 32 కిలోల కంటే ఎక్కువ ప్యాక్ చేయవద్దని వీడియోలో వివరించారు.  ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో ప్రయాణించే అతిథులు దాని క్విక్ సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్ సౌకర్యం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. నవంబర్ 21 - జనవరి 8 మధ్య అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.5 మిలియన్లకు పైగా ప్రయాణీకులను స్వాగతించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎతిహాద్ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com