బహ్రెయిన్ జాతీయ దినోత్సవం.. స్మారక స్టాంపులు విడుదల

- December 17, 2022 , by Maagulf
బహ్రెయిన్ జాతీయ దినోత్సవం.. స్మారక స్టాంపులు విడుదల

బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రవాణా మంత్రిత్వ శాఖలోని బహ్రెయిన్ పోస్ట్ స్మారక స్టాంపులను విడుదల చేసింది.  బహ్రెయిన్ పోస్ట్ ఈ సంవత్సరం నేషనల్ యాక్షన్ చార్టర్, దాని ఆకట్టుకునే భవనాన్ని థీమ్‌గా తీసుకొని స్మారక స్టాంపులను రూపొందించారు. స్మారక స్టాంపులను తయారీపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 220,000 మంది కంటే పౌరులు పాల్గొన్నారు. స్మారక స్టాంపులు బహ్రెయిన్ సాంస్కృతిక మైలురాయి, దాని ప్రత్యేక నిర్మాణాన్ని తెలియజేస్తుంది. స్మారక స్టాంపులు 500 ఫిల్స్ డినామినేషన్, మొదటి రోజు సంచిక సెట్ రెండున్నర దినార్ల ధరలో లభిస్తుందని పేర్కొంది. స్మారక స్టాంపులు పోస్టల్ మ్యూజియం, బహ్రెయిన్ పోస్ట్ అన్ని శాఖలలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అధికారిక పని వేళల్లో కొనుగోలు కోసం 17523403కు లేదా ఇ-మెయిల్: [email protected]. చేయడం ద్వారా పొందవచ్చని బహ్రెయిన్ పోస్ట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com