ఫిఫా ప్రపంచకప్ ఫైనల్: సందడి చేయనున్న షారూఖ్ ఖాన్
- December 17, 2022
ఖతార్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ డిసెంబర్ 18న జరిగే ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో సందడి చేయనున్నారు. డిసెంబర్ 18న జరిగే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌ను వీక్షించేందుకు తాను ఏస్ ఫుట్‌బాల్ ఆటగాడు వేన్ రూనీతో కలిసి వస్తానని షారూఖ్ చెప్పాడు. ఈ మేరకు బాలీవుడ్ సూపర్‌స్టార్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన కొత్త రాబోయే చిత్రం 'పఠాన్' ప్రమోషన్ కోసం ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో షారూఖ్ హల్ చల్ చేయనున్నారు. జియో సినిమా, స్పోర్ట్స్ 18 స్టూడియోలలో వేన్ రూనీతో కలిసి షారూఖ్ సందడి చేయనున్నారు. "ఫీల్డ్ పార్ మెస్సీ ఔర్ ఎంబాప్పే... స్టూడియో మేన్ వేన్ రూనీ ఔర్ మెయిన్" అంటూ షారూఖ్ ట్వీట్ క్యాప్షన్ రాసాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







