యూఏఈ విజిట్ వీసాల పొడిగింపు: పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు

- December 18, 2022 , by Maagulf
యూఏఈ విజిట్ వీసాల పొడిగింపు: పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు

యూఏఈ: యూఏఈ విజిట్ వీసా వ్యవధి ముగిసేలోపు దేశం నుండి నిష్క్రమించడానికి ప్రత్యేక వీసా మార్పు ప్యాకేజీలను ప్రవేశపెట్టినట్లు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. ట్రావెల్ ఏజెన్సీల ప్రకారం.. యూఏఈ విజిట్ వీసా హోల్డర్‌లు దేశంలోని వారి స్టేటస్ ను పొడిగించడానికి అనుమతి లేదు. ఈ మేరకు విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు చేశారు.

బస్సు ద్వారా వెళ్లేందుకు Dh599 - Dh850

ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ముస్తాఫిర్  బస్సులో వెళ్లి వీసా మార్పు చేసుకునేందుకు Dh799కి ప్యాకేజీని అందిస్తోంది. అజ్వా టూర్స్ సందర్శకులకు బస్సు ద్వారా వీసా స్థితిని మార్చుకునే అవకాశాన్ని అందిస్తోంది. కంపెనీ Dh599 నుండి 30 రోజుల వీసాను, Dh799కి 60 రోజుల వీసాను అందిస్తోంది. భారతదేశం, ఫిలిప్పీన్స్, నేపాల్, శ్రీలంక పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వారికి మాత్రమే బుకింగ్ లు అందుబాటులో ఉన్నాయని, పాకిస్తాన్ జాతీయత, ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన వారు బస్సులో బయటకు వెళ్లడానికి అనుమతించబడరని అజ్వా టూర్స్ జీఎం మాలిక్ బెడేకర్ చెప్పారు.  అనిషా టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో యూఏఈ నుండి బస్ ద్వారా ఒమన్‌కు వెళ్లడం ద్వారా వీసా పునరుద్ధరణకు Dh850 ఖర్చు అవుతుంది.  

విమానాశ్రయం నుండి విమానాశ్రయంకు Dh999 - Dh1,999

ముస్తాఫిర్ Dh1,100 లకే విమానాశ్రయం నుండి విమానాశ్రయం నుండి వీసా మార్పు ఫ్యాకేజీని అందిస్తుంది. అజ్వా టూర్స్ అందించే 30 రోజుల వీసా Dh999 నుండి ప్రారంభమవుతుంది. 60 రోజుల వీసా Dh1,999 నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది. సందర్శకులు విమానంలో ఒమన్‌కు వెళ్లాలనుకునే వారు అనిషా టూర్స్ అందించే Dh1,250 ప్యాకేజీని కూడా ఎంచుకోవచ్చు. దుబాయ్‌కి చెందిన స్మార్ట్ ట్రావెల్స్ కూడా 30 రోజుల వీసా కోసం Dh1,050,  60 రోజుల వీసా కోసం Dh1,300 ల ప్యాకేజీలను అందిస్తోంది.

దేశంలో అయితే Dh1,800 - Dh2,200

దుబాయ్ లోపల నుండి Dh1,800 ధరకు విజిట్ వీసా మార్పును కూడా అందిస్తున్నట్లు ముస్తాఫిర్ ఏజెన్సీ తెలిపింది. అనిషా టూర్స్ అండ్ ట్రావెల్స్ సందర్శకులు తమ వీసాలను దుబాయ్ నుండి 2,200 దిర్హామ్‌లకు పునరుద్ధరించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

వీసా చెల్లుబాటు ముగిసిన తర్వాత సందర్శకులు దేశం నుండి తప్పనిసరిగా నిష్క్రమించాలి. ట్రావెల్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విజిట్ వీసాలపై దేశంలో నిరవధికంగా ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చారని తెలిపారు. సందర్శన వీసా స్థితిని మార్చడానికి దేశం నుండి నిష్క్రమించాలనే నిబంధన ఎప్పటినుంచో ఉందని, కోవిడ్-19 మహమ్మారి సమయంలోనే మానవతా ఆందోళనల దృష్ట్యా దేశంలోనే వీసా స్థితిని మార్చుకోవడానికి యూఏఈ నిబంధనలను సవరించిందని వెల్లడించారు. దేశంలోని అనేక ఇతర ట్రావెల్ ఏజెన్సీలు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్యాకేజీలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com