వ్యభిచార ముఠా గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్
- December 19, 2022
కువైట్: అహ్మదీ గవర్నరేట్‌లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మంది వ్యక్తుల నెట్‌వర్క్‌ను అంతర్గత మంత్రిత్వ శాఖలోని క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది. చట్టవిరుద్ధమైన వ్యక్తులను, ప్రజా నైతికతకు విరుద్ధంగా కార్యకలాపాలలో పాల్గొనేవారిని అరెస్టు చేయడానికి, అలాగే మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో వ్యభిచార నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యభిచార నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి ఉపయోగించిన అనేక నిఘా కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తొమ్మిది మంది మహిళలు, ముగ్గురు పురుషులతో సహా 12 మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం నిందితులందరినీ సంబంధిత విభాగాలకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







