ఏపీ వాసులకు శుభవార్త...
- December 19, 2022
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. సంక్రాంతి సందర్భంగా 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఈ వివరాల్ని వెల్లడించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 6-18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. అయితే, ఛార్జీల విషయంలో మార్పు లేదని, ప్రత్యేక బస్సు సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని తెలిపారు. ఈ సర్వీసుల కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. రిటర్న్ టికెట్ కూడా కలిపి బుక్ చేసుకుంటే, ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ కూడా కల్పించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన పలు కీలక వివరాల్ని కూడా తిరుమల రావు వెల్లడించారు. రాష్ట్ర పరిధిలో 62 స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్ని కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాబోయే మార్చి వరకు కార్గో సేవల ద్వారా రూ.165 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
త్వరలోనే ఏపీలోని అన్ని బస్సుల్లోనూ టిమ్ మెషీన్లను ప్రవేశపెట్టనున్నమన్నారు. సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన లేదన్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా తొలగించడం లేదని వివరించారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీలు, అలవెన్సులు కూడా అందజేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







