లియోనెల్ మెస్సీకి బ్లాక్ రోబ్ తొడిగిన ఖతార్ ఎమిర్..

- December 19, 2022 , by Maagulf
లియోనెల్ మెస్సీకి బ్లాక్ రోబ్ తొడిగిన ఖతార్ ఎమిర్..

దోహా: అర్జెంటినా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో లియోనెల్ మెస్పీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది.ఫుట్‌బాల్ ఆటలో అతనో లెజెండరీ ఆటగాడు. ఎక్కడ చూసినా మెస్సీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన జట్టును ప్రపంచ విజేతగా నిలిపాడు. గోల్డెన్ బాల్ కూడా గెలుచుకున్నాడు.

అయితే, వీటితోపాటు మెస్సీ మరో సర్‌ప్రైజ్ కూడా అందుకున్నాడు.ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమాద్ అల్ తని తొడిగిన బ్లాక్ రోబ్. ప్రపంచ కప్ ట్రోఫీ అందించే ముందు మెస్సీకి దీన్ని ప్రత్యేకంగా తొడిగారు. దీని గురించి అంతకుముందు ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. మెస్సీకి ఈ స్పెషల్ వస్త్రాన్ని తొడగడంతో అందరూ దీని గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.ఇది చాలా ప్రత్యేకమైన, సంప్రదాయ వస్త్రం అని తెలుస్తోంది. మెస్సీకి తొడిగిన ఈ నల్లటి వస్త్రాన్ని ఖతార్ సహా అరబ్ దేశాల్లో ఒంటె వెంట్రుకలు, గొర్రె ఉన్నితో ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీన్ని అందరూ తొడుక్కోవడం కుదరదు. ఎందుకంటే దీన్ని వారి మతానికి చెందిన అధిపతులు, ప్రబోధకులు, రాజ వంశీకులు మాత్రమే ధరిస్తారు.

అది కూడా ప్రత్యేక సందర్భాల్లోనే.సాధారణ ప్రజలు దీన్ని ధరించరు.అంత ప్రత్యేకత కలిగిన ఈ వస్త్రాన్ని ఖతార్ ఎమిర్ మెస్సీకి బహూకరించడం విశేషం. నేటి తరంలో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారుల్లో మెస్సీ ఒకరు. అందులోనూ ఫుట్‌బాల్‌లో ఆయనో లెజెండ్.ఈ వస్త్రాన్ని ధరించిన మెస్సీ పొందిన గౌరవం చరిత్రలో నిలిచిపోతుంది.అయితే, ఆయన ఈ వస్త్రాన్ని ఎక్కువ సేపు తొడుక్కోలేదు. కొద్దిసేపట్లోనే వస్త్రాన్ని తీసేశాడు.తర్వాత కప్ అందుకుని, సహచర ఆటగాళ్లతో సందడి చేశాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com