అబుధాబి విమానాశ్రయంలో బయోమెట్రిక్ సేవలు ప్రారంభం

- December 20, 2022 , by Maagulf
అబుధాబి విమానాశ్రయంలో బయోమెట్రిక్ సేవలు ప్రారంభం

యూఏఈ: హైటెక్ నెక్స్ట్-జెన్ బయోమెట్రిక్ మొదటి దశ అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. ఇందులో ప్రయాణీకులు బోర్డింగ్ పాస్ పొందడానికి, ఇతర సేవలను పొందేందుకు పేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అబుధాబికి చెందిన టెక్ కంపెనీ NEXT50 తన అత్యాధునిక AI సొల్యూషన్‌లను గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ సొల్యూషన్స్ భాగస్వాములు IDEMIA, SITA లతో పాటు ఎంపిక చేసిన సెల్ఫ్-సర్వీస్ బ్యాగేజ్ టచ్‌పాయింట్‌లు, ఇమ్మిగ్రేషన్ ఇ-గేట్‌లు,  బోర్డింగ్ గేట్‌లలో అన్ని ప్యాసింజర్ టచ్‌పాయింట్‌లలో ఈ సాంకేతికతను అమలు చేయనున్నారు. విమానాశ్రయంలోని అన్ని కస్టమర్ టచ్‌పాయింట్‌లలో బయోమెట్రిక్ సామర్థ్యాలతో మిడ్‌ఫీల్డ్ టెర్మినల్ బిల్డింగ్‌ను మొదటి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు.

NEXT50 సీఈఓ ఇబ్రహీం అల్ మన్నా మాట్లాడుతూ.. బయోమెట్రిక్స్ ప్రాజెక్ట్ ఎమిరేట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌లో భాగంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. విమానాశ్రయంలోని అన్ని కస్టమర్ టచ్‌పాయింట్‌లలో బయోమెట్రిక్ సొల్యూషన్స్‌ అమలు చేస్తున్న ఈ ప్రాంతంలోని ఏకైక విమానాశ్రయం ఇదే అవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సాంకేతికతతో నడిచే విమానాశ్రయానికి ఆపరేటర్‌గా అవతరించేందుకు అబుధాబి ఎయిర్‌పోర్ట్ దృష్టికి దోహదం చేస్తుందన్నారు. కొత్త సాంకేతికత వల్ల  ప్రయాణీకులకు 'కర్బ్-టు-గేట్' నుండి సౌకర్యవంతమైన, సరళీకృత, కాంటాక్ట్‌లెస్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.  

అబుధాబి విమానాశ్రయం ఎండీ, సీఈఓ ఇంజినీర్ జమాల్ సలేం అల్ ధాహేరి మాట్లాడుతూ.. అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన బయోమెట్రిక్స్ మొదటి దశ విస్తరణ, సామర్థ్యం, సౌలభ్యాన్ని పెంచే ఆవిష్కరణ జరిగిందన్నారు.  సాంకేతికతను అందించడం ద్వారా విమానాశ్రయ అనుభవాలను తమ నిబద్ధతను మరింత సుస్థిరం చేస్తుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అబుధాబి బయోమెట్రిక్ ప్రయాణంలో ప్రతి టచ్ పాయింట్‌ను చేర్చడానికి ప్రపంచంలోని మొట్టమొదటి విమానాశ్రయంగా నిలుస్తుందన్నారు. సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజీ డ్రాప్, పాస్‌పోర్ట్ కంట్రోల్, బిజినెస్ క్లాస్ లాంజ్,  బోర్డింగ్ గేట్‌లతో సహా విమానాశ్రయంలోని అనేక టచ్‌పాయింట్‌ల వెంట ప్రయాణీకుల వివరాలను ధృవీకరించడానికి సిస్టమ్‌లు హైటెక్ బయోమెట్రిక్ కెమెరాలను ఉపయోగిస్తాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com