రేపు సీఎం జగన్ పుట్టిన రోజు.. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు
- December 20, 2022
అమరావతి: సీఎం జగన్ పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రామాలు నిర్వహించేదుకు రెడీ అయ్యారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరుతో కొద్ది రోజులుగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. కళారూపాల ప్రదర్శనలతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు.దీని కోసం రూ.2 కోట్లను కేటాయించి వేడుకలు చేస్తున్నారు.జగన్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడం కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసి సజ్టల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
ఇందులో ఎవరికైనా అవసరమైనప్పుడు రక్తదానం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.గతంలో 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని తెలిపారు.ఈ సారి రికార్డు బ్రేక్ చేసే విధంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సారి http://www.ysrcpblooddonation.com/ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD







