ఒమన్‌లో 347 ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు, 7092 రిజిస్ట్రేషన్లు
- December 20, 2022
మస్కట్: షిఫా దరఖాస్తుపై 7,092 మంది దాతలు (మరణం తర్వాత అవయవ దాతలు) నమోదు చేసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్‌లో అవయవ మార్పిడి ఆపరేషన్ల సంఖ్య 347 కి చేరుకున్నాయని తెలిపింది. వాటిలో 306 ప్రత్యక్ష దాతలు, 19 మరణించిన దాతల నుండి పొందిన 325 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఉండగా.. ప్రత్యక్ష దాతల నుండి కాలేయ మార్పిడి సంఖ్య 22 గా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవయవ దానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవయవ దానం కోసం జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ గణంకాలను వెల్లడించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న ఒమన్ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హెల్త్ మినిస్ట్రీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







