54 ఐపిఆర్‌ ఉల్లంఘనల్ని సీజ్‌ చేసిన దుబాయ్‌ కస్టమ్స్‌

- April 26, 2016 , by Maagulf
54 ఐపిఆర్‌ ఉల్లంఘనల్ని సీజ్‌ చేసిన దుబాయ్‌ కస్టమ్స్‌

ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్‌ (ఐపిఆర్‌) ఉల్లంఘనలకు వ్యతిరేకంగా దుబాయ్‌ కఠిన చర్యలు చేపట్టింది. దుబాయ్‌ కస్టమ్స్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో మొత్తం 135 సీజ్‌లు జరిగాయనీ, ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఇప్పటికే 54 సీజ్‌లు జరిగాయని స్పష్టమవుతుంది. గత ఏడాది జరిగిన సీజ్‌ల విలువ 16.8 మిలియన్‌ దిర్హామ్‌లు కాగా, ఈ ఏడాది సీజ్‌ చేయబడినవాటి విలువ 34.5 మిలియన్‌ దిర్హామ్‌లని దుబాయ్‌ కస్టమ్స్‌ పేర్కొంది. దుబాయ్‌ కస్టమ్స్‌ - కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అబ్దుల్లా అల్‌ ఖాజా మాట్లాడుతూ, కస్టమ్స్‌ సీజ్‌ చేసిన వస్తువులు దేశంలోకి ప్రవేశించినట్లయితే ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు, ఎకానమీపైనా ప్రభావం చూపేదని అన్నారు. వరల్డ్‌ ఐపి డే సందర్భంగా ఖాజా మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ పైరసీ విపరీతంగా పెరిగిపోతోందని, మెనా రీజియన్‌లో వీటి కారణంగా ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com