నెత్తిపైన క్రిస్మస్ ట్రీ.. గిన్నీస్ రికార్డు సాధించిన హెయిర్ స్టైలిస్ట్ ..
- December 21, 2022 
            సిరియా: మహిళలు జట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. శుభకార్యాలు, పలు షోలు, ఈవెంట్లు, ఇలా ప్రత్యేక కార్యక్రమాలకు, ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తమ జట్టును పలురకాల స్టైల్స్‌లో ఆకర్షనీయంగా అలంకరించుకుంటారు. ఇక హెయిర్ స్టైలిస్ట్‌లు అయితే, మగువల మనస్సులు దోచేలా కొత్తకొత్త స్టైల్స్‌ను ఆవిష్కరిస్తుంటారు. తాజాగా ఓ ప్రఖ్యాత సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ డానీ హిస్వానీ తన ప్రతిభతో ఓ మహిళ తలపై ఏకంగా క్రిస్మస్ ట్రీనే రూపొందించాడు. ఫలితంగా గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
డానీ హిస్వానీ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. పలుసార్లు అనేక విధాలైన హెయిర్ స్టైలిస్‌తో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. హిస్వాని ప్రపంచ మ్యాగజైన్‌లతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్స్ దీపిక పదుకొనే, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్పగొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా డానీ హిస్వానీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఓ మోడల్ తలపై 2.90 మీటర్ల ( 9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ ట్రీ ఆకారంలో జట్టును అలంకరించాడు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







