ఇండియాస్ లాఫ్టర్ ఛాంపియన్స్ కువైట్‌లో లైవ్ ఈవెంట్

- December 21, 2022 , by Maagulf
ఇండియాస్ లాఫ్టర్ ఛాంపియన్స్ కువైట్‌లో లైవ్ ఈవెంట్

కువైట్: ఇండియన్ లాఫ్టర్ ఛాంపియన్, స్టాండ్-అప్ కమెడియన్ రజత్ సూద్ కువైట్‌లో జనవరి 6వ తేదీన సాయంత్రం 6గంటలకు AIS- అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదాన్ హవల్లీలో లైవ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అతనితో పాటు విఘ్నేష్ పాండే - మొదటి వెంట్రిలాక్విస్ట్ తన మహిళా పాత్ర "అన్నా"తో పాటుగా కూడా తన శైలితో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనున్నాడు. వీరితోపాటు మరో నవ్వుల ఛాంపియన్ జైవిజయ్ సచన్ కూడా ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఈ కార్యక్రమాన్ని SAAZ ఈవెంట్స్ నిర్వహిస్తున్నది. ప్రవేశ టిక్కెట్‌లను ఆన్‌లైన్‌ https://www.eventat.com/comdey-nightలో బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం (0965) 60711700లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com