రమదాన్ ప్రార్థనలకు సిద్ధమైన గ్రాండ్ మస్జీదు

- December 21, 2022 , by Maagulf
రమదాన్ ప్రార్థనలకు సిద్ధమైన గ్రాండ్ మస్జీదు

కువైట్: పవిత్రమైన రమదాన్ మాసంలో ప్రార్థనల పునఃప్రారంభం కోసం తాజా సన్నాహాలను సమీక్షించడానికి అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బాదర్ అల్-ఒతైబీ గ్రాండ్ మస్జీదును సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అబ్దుల్ అజీజ్ అల్-మాజిద్ సూచనల మేరకు, పవిత్ర మాసంలో తరావిహ్, ఖియామ్ ప్రార్థనలు నిర్వహించడానికి ఉత్తమ వాతావరణాన్ని సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత మస్జీదులలో సాధారణ ప్రార్థనలు తిరిగి ప్రారంభం కావడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఆరాధకులకు అన్ని సౌకర్యాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పవిత్ర మాసాన్ని స్వాగతించడానికి మస్జీదు భద్రత, సంసిద్ధతను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అల్-ఒతైబీ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com